08-09-2025 07:00:25 PM
చిట్యాల,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తహసీల్దార్ ఇమామ్ బాబా షేక్, ఎంపిడివో జయశ్రీ అన్నారు.సోమవార చిట్యాల మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి ఆధ్వర్యంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్, ఎంపీడీవో జయశ్రీ హాజరై మాట్లాడుతూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.
గురువుకు మించిన దైవం ఈ లోకంలో లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించే అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా ఉపాధ్యాయులు నిలుస్తున్నారని అన్నారు. విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన ఉపాద్యాయులను గుర్తించి, సత్కరించడం మంచి అనుభూతి అన్నారు. ఉపాధ్యాయుల మోటివేషన్ వల్లే అన్ని శాఖల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని, ఉపాధ్యాయులు కృషిని అభినందించారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 15మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా మెమెంటోలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.