08-09-2025 07:45:25 PM
చండూరు,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ వృత్తిలో బాధ్యతాయుతంగా పనిచేస్తూ, ఆదర్శంగా నిలవాలని చండూరు ఎంపీడీవోబి. యాదగిరి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీలు,ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, వనమహోత్సవం, ఇంకుడు గుంతలు,తదితర పనులపై గ్రామాల్లో జరిగిన పనుల గురించి, జరగబోయే పనుల గురించి సిబ్బందికి దిశనిర్దేశం చేశామని ఆయన అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనుల్లో క్వాలిటీ, క్వాంటిటీ ఉండేవిధంగా కూలీలతో పనులు చేయించుకోవాలన్నారు. సోషల్ ఆడిట్ సంబంధించిన విషయాలపై గ్రామాల వారీగా రివ్యూ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.