calender_icon.png 8 September, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మించాలని వినూత్నంగా నిరసన

08-09-2025 07:11:53 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తా (యాప) వద్ద నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాది హక్కుల దండోరా సంఘం కాసిపేట అధ్యక్షులు అటకపురం రమేష్ సోమవారం డిమాండ్ చేస్తూ అద్వానంగా తయారైన రోడ్డుపై ప్లకార్డుతో నిరసన తెలిపారు. రోడ్డుపై ఏది ధరించక పోయిన ఫైన్ విధించే అధికారులు అసలు రోడ్లనే పట్టించుకోకపోతే తనకు ఎంత ఫైన్ కడతారో తెలపాలని వినూత్నంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా కుంగిపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేవాపూర్ లో యూనియన్ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే వినోద్ తన పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రయత్నించాడు. తప్ప రోడ్డు పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కొండాపూర్ యాప వద్ద నూతన రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.