calender_icon.png 11 May, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులు

09-05-2025 11:37:40 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో సాగుతున్న భీక‌ర పోరులో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కు బంజారా ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ... దేశ రక్షణలో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణ త్యాగం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మోతిలాల్ నాయక్, సైదా నాయక్, లింగా నాయక్, మంగ్తా నాయక్,మంగ్యా నాయక్, రాములు నాయక్, శ్రవణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.