10-05-2025 12:00:00 AM
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ. వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లోని శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీవాసుల ఇళ్లను కేటాయిం చాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ అనిరుద్ దురిశెట్టి ని కలిసి వినపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వివేకానంద నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి ఏడాదిన్నర కావొస్తున్న ఇంత వరకు బాధితులకు ఇళ్లను కేటాయించలేదని, వెంటనే నిరాశ్రయులైన19 మంది నిరుపేద దళిత కుటుం బాలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని పత్రంలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఇళ్ల కేటాయింపు సమస్య పై కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి, ఎంపీ (రాజ్యసభ) డాక్టర్ కె. లక్ష్మణ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసామని, వారి నుంచి కూడా కలెక్టర్ ఇళ్ల కేటాయింపు కై సూచనలు అం దాయని, అందుకు సానుకూలంగా స్పందించిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ త్వరలోనే శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తి పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారని వినయ్ కుమార్ తెలిపారు. వారితో పాటు బస్తి వాసులు ఎంబి.కృష్ణ, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు పాల్గొన్నారు.