10-05-2025 12:00:00 AM
మేడ్చల్, మే 9 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్, అలియాబాద్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిఆర్‌ఓ హరిప్రియ, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల మేనేజర్ ఎల్ సుగుణ బాయి శుక్రవారం ఆకస్మికంగా పనిచేశారు. ధాన్యం దించుకోవడంలో ఇలాంటి జాప్యం చేయొద్దని, అవసరమైతే హమాలీలను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని ఇన్చార్జికి సూచించారు.
అధికార యంత్రాంగం సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులు తేమ, తాలు, మట్టి లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. వరి కోత యంత్రం వారితో మాట్లాడుకుని ధాన్యాన్ని క్రమ పద్ధతిలో తీసుకురావాలన్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటలలో నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు.