calender_icon.png 29 August, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతలాకుతలం

29-08-2025 04:21:44 AM

  1. రాత్రంతా జాగరణలో జనం
  2. నీట మునిగిన పలు కాలనీలు 
  3. నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం
  4. కొట్టుకపోయిన రోడ్లు, తెగిన చెరువులు
  5. స్తంభించిన రాకపోకలు 
  6. వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
  7. మత్తడి పోస్తున్న  చెరువులు.. 
  8. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ

నిర్మల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం సాయంత్రం  6 గంటల నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. నాలుగు గంటల్లోనే 332 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నిర్మల్ పట్టణం లోని జిఎన్‌ఆర్ కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ మంచిర్యాల చౌరస్తా సోఫీ నగర్ నీట మునగడంతో ప్రజలు రాత్రివేళ బిక్కుబిక్కుమం టూ కాలం గడిపారు.

బైంసా మండలంలోని గుండెగా తానూరు మండలంలోని జరి గ్రామంలో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో పెంబి దస్తురాబాద్ కడెం ఖానాపూర్ లో 72 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కుంటాల సారంగాపూర్ మామిడా దిల్వార్పూర్ మం డలంలో 52 మిల్లీమీటర్లు మిగతా మండలాల్లో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

జిల్లా లో భారీ వర్షాల వల్ల 35 ఆర్‌ఎంబి రోడ్లు తెగిపోగా 24 పంచాయతి రోడ్లు కొట్టుకపోయినట్టు అధికారులు తెలిపారు. 10 ఇండ్లు దెబ్బతిన్నాయి. నదులు వాగులు చెరువుల కింద వరదలు ఏర్పడి 2000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడినట్టు అధికారులు తెలిపారు. గోదావరి వరదలు చిక్కిన ముగ్గురిని కలెక్టర్, ఎస్పీ స్వయంగా రక్షించి చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నిర్మల్ ఆర్టీసీ బస్సులను ఖానాపూర్ జగిత్యాల్ కరీంనగర్ మీదుగా అధికారులు మళ్లించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు 24 గంటలు రాత్రంతా జాగరణ చేసి వారికి కావలసిన అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టారు. కుంటాల లోకేశ్వరం పెంబి సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకోవడంతో మత్తడి పోస్తున్నాయి. ఈ సహా యక చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ బైంసా నిర్మల్ ఏఎస్పీలు రాకేష్ మీనా రాజేష్ కుమార్ భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ రెవిన్యూ పోలీస్ సిబ్బంది పాలుపంచుకున్నారు.

ప్రత్యేక అధికారి పర్యటన...

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెంద నవసరం లేదని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన కలెక్టర్ అభిలాష అభినన్‌తో కలిసి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా పట్టణంలోని బోయవాడలో పర్యటించి, వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో మాట్లాడారు.

ఇండ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామని, వరద నీటిలో బియ్యం నానిపోవడంతో వారికి బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో పరిశుభ్రత కార్యక్రమా లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల చౌర స్తా, విశ్వనాథ్పేట్, శాంతినగర్ సమీపంలో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ప్రత్యే క అధికారి, భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయ టకు రాకూడదని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.

ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 9100577132 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు లోతట్టు పరిసరాలకు వెళ్లరాదని, మత్స్య కారులు, పశు కాపరులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లక్ష్మణచందా మండలంలోని మునిపల్లి గ్రామంలో వాగు అవతలి వైపు చిక్కుకుపోయిన శంకర్ అనే పశువుల కాపరిని ఎన్డీఆర్ ఎఫ్ బృందాల సహకారంతో సురక్షితంగా రక్షించగలిగామని కలెక్టర్ వివరించారు. 

వరద ప్రాంతాల్లో పర్యటించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా మం డలాల్లో పట్టణంలో కురిసిన భారీ వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లు నీట మునిగిన ఇండ్ల ను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం పరిశీలించారు. సోన్ మండలంతో పాటు లక్షల చందా సారంగాపూర్ నిర్మల్ రూలర్ మండలాలను పరిశీలించిన అనంతరం పట్టణంలోని జిఎన్‌ఆర్ కాలనీ వైయ స్సార్ కాలనీ, కావేరినగర్, రామ్‌నగర్ కాలనీలు సందర్శించి ప్రజలకు ధైర్యంగా ఉం డాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. 

ప్రభుత్వం అండగా ఉంటుంది: మాజీ మంత్రి  ఇంద్రకరణ్

జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి భరో సా ఇచ్చారు. గురువారం వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా నిర్మల్ పట్టణ తో పాటు సారంగాపూర్ దిల్వార్పూర్ లక్మచందా తదితర మండలాల్లో వర్షం వల్ల దెబ్బతిన పంటలను రోడ్లను పరిశీలించి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వివరించడం జరిగిందని తెలిపారు. త్వరలో అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత వారికి అన్ని రకాల ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

పంట పొలంలో ఒకరు మృతి

బెజ్జూర్,ఆగస్టు28(విజయక్రాంతి): మండలంలోని ఎలుకపల్లికి చెందిన నికాడి వసంత్ (35) పంట పొలంలో మృతి చెందినట్లు ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు. నీకాడి వసం త్ ఈనెల 26వ తేదీన ఇంటి నుండి మద్యం  మత్తులో వెళ్లిపోయాడని కనిపించలేదని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. మాండూరి మల్లేష్ పంట పొలం వైపు గురువారం వెళ్లిన సమయంలో దుర్వాసన రావడంతో ఆ ప్రాం తంలో గమనించగా వసంత్ మృతదే హం కనిపించింది. అతనికి భార్య,కూతురు,కుమారుడు ఉన్నారు. 

సహాయక చర్యలు వేగంగా అమలు చేయాలి

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉమ్మడి జిల్లా వర్షా లు వరదలు ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్న తీసుకుంటున్న చర్యలపై హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడి ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమన్వయం తో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలకుండా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం ద్వారా ఏ సాయం కావాలన్నా తాము సమకూరుస్తామని మంత్రి భరోసా కల్పించారు.