29-08-2025 04:26:10 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు ౨౮(విజయక్రాంతి): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) ముసుగులో వందల కోట్ల విలువైన ప్రభుత్వ చెరువును అక్రమంగా మిం గేసి, తమ ప్రైవేట్ వెంచర్‌కు అందంగా మా ర్చేసుకుంది ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ సంస్థ. గాగిలాపూర్ గ్రామ పరిధిలోని చారిత్రక ఉస్మాన్‌కుంట చెరు వు ఇప్పుడు ’ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్’గా నామకరణం చేయబడి, ఆ సంస్థ నిర్మిస్తున్న విల్లాల సముదాయానికి ప్రత్యేక ఆస్తిగా ప్రచా రం అవుతోంది. అధికారుల అండదండలతో జ రుగుతున్న ఈ అక్రమంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అభివృద్ధి పేరుతో అక్రమాలు
చెరువు అభివృద్ధి పేరుతో ప్రభు త్వం నుంచి అనుమతులు పొందిన ప్రణీత్ ప్రణవ్, దానిని తమ సొంత ఆస్తి గా మార్చేసుకుంది. చెరువు కట్ట ఎత్తు పెం చడం, చుట్టూ గ్రీనరీ, లైటింగ్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు వంటి పనులకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఈ సంస్థకు చెరువుపై ఎటువంటి లీగల్ రైట్స్ లేవని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ, ప్రణీత్ ప్రణవ్ సంస్థ తమ విల్లాలను విక్రయించే క్రమంలో, ఈ చెరువు తమ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమని, కేవలం తమ కొనుగోలుదారు లకు మాత్రమే దీనిపై ప్రత్యేక హక్కులు ఉంటాయని బహిరంగంగా ప్రచారం చేస్తోం ది. ఇది నిబంధనలకు విరుద్ధం.
స్థానికుల ఆగ్రహం
ఒకప్పుడు స్థానికులందరికీ అందుబాటు లో ఉన్న ఉస్మాన్‌కుంట చెరువు, ఇప్పుడు ’ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్’గా మారి, కేవలం ప్రణీత్ ప్రణవ్ విల్లాల నివాసితులకు మాత్రమే పరిమితం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువును అభివృద్ధి చేయడం మంచిదే అయినా, దానిని ప్రైవేట్ ఆస్తిగా మార్చి స్థానికులకు దూరం చేయడం అన్యాయమని వారు మం డిపడుతున్నారు. ఇది కేవలం తమ ప్రాజెక్ట్ విల్లాలను విక్రయించుకునేందుకు ఆ సంస్థ పన్నుతున్న పన్నాగం అని ఆవేదన చెందుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా, అధికార యం త్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణీ త్ ప్రణవ్ సంస్థ మామూళ్ల మత్తులో అధికారులను ముంచెత్తుతోందని, అందుకే ప్రభు త్వ భూములు ప్రైవేట్ పరం అవుతున్నాయ ని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ప్ర భుత్వం తక్షణమే జోక్యం చేసుకొని, చెరువు ను కాపాడాలని, దోషులపై కఠిన చర్యలు తీ సుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సంస్థ మౌనంపై విమర్శలు
ఈ వివాదంపై వివరణ కోరేందుకు ’విజయక్రాంతి’ ప్రతినిధి ప్రణీత్ ప్రణవ్ సంస్థ ప్రతినిధులను సంప్రదించగా, వారు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. కీలకమైన ఈ ఆరోపణలపై సంస్థ మౌనం వహించ డం అక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందని, ఇది అక్రమ కార్యకలాపాలను నిర్ధారించడానికి సూచికగా నిలుస్తుందని స్థానికులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
70 ఎకరాల్లో విల్లాలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం గాగిల్లాపూర్ గ్రామంలోని సర్వేనంబర్లు 201పి నుంచి 212పి వరకు విస్తరించి ఉన్న సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ’వెంకట ప్రణీత్ డెవలపర్స్’.. ’ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్’ పేరిట విల్లాల సముదాయాన్ని నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ మధ్యలోనే 8 ఎకరాల 13 గుంటల విస్తీర్ణంలో మహమ్మద్ ఉస్మాన్‌కుంట చెరువు ఉంది. తమ విల్లాల అమ్మకాలను పెంచుకునేందుకు, కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రణీత్ ప్రణవ్ సంస్థ సీఎస్‌ఆర పథకాన్ని ఒక పాచికగా వాడుకుంది.
పట్టా భూమిగా నమోదు, ఆపై కబ్జా
రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఉస్మాన్‌కుంట చెరువు భూమి వివిధ వ్యక్తుల పేరుపైన పట్టా భూమిగా నమోదై ఉంది. నీరు లేని సమయంలో మాత్రమే పట్టాదారులకు సాగు చేసుకునే హక్కు ఉంటుంది తప్ప, మిగిలిన సమయంలో వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ప్రణీత్ ప్రణవ్ సంస్థ సర్వే నంబర్లు 201, 22, 23, 204, 205తో పాటు ఫీడర్ ఛానల్, సర్ఫేస్ ఛానల్, బఫర్ జోన్ ప్రాంతాలను కలుపుకొని మొత్తం 9 ఎకరాల 32 గుంటల చెరువు స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.