05-11-2025 01:31:31 AM
న్యూఢిల్లీ/లండన్, నవంబర్ 4: హిందూ జా గ్రూప్ చైర్మన్, భారతీయ- బ్రిటీష్ బిలియనీర్ గోపిచంద్ పీ హిందూజా (85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న గోపిచంద్ లండన్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గోపిచంద్ అవిభాజ్య భారత్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 19 జనవరి 1940లో జన్మించారు. నలుగురు హిందూ జా సోదరుల్లో ఈయన రెండోవారు.
ఆయనకు అన్న శ్రీచంద్, తమ్ముళ్లు ప్రకాష్, అశోక్. ముంబైలోని జైహింద్ కళాశాల నుంచి గోపిచంద్ పట్టభద్రుడయ్యారు. వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ, రిచ్‌మండ్ కాలేజీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. వారి ముందునుంచి వ్యాపార కుటుంబం. వారు హిందూ జా పేరుతో అనేక కంపెనీలు నడుపుతుండే వారు. గోపిచంద్ తండ్రి పరమానంద్ హిందూజా ముంబైలో టెక్స్‌టైల్, ట్రేడింగ్ వ్యాపారాలు ప్రారంభించి, వాటిని వృద్ధిలోకి తీసుకొచ్చారు.
తర్వాత అవే వ్యాపారాలను ఇరాన్‌కు విస్తరించారు. అలాగే ఇనుప ఖనిజంతో పాటు ఆహార ధాన్యాలను భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతులు ప్రారంభించారు. 1980 ప్రాంతంలో బ్రిటిష్ లేలాండ్ నుంచి అశోక్ లేలాండ్‌ను, చెవ్రాన్ నుంచి గల్ఫ్ ఆయిల్ కంపెనీని కొనుగోలు చేశారు. 1990లో స్విట్జర్లాండ్, భారత్‌లో బ్యాంకులను స్థాపించారు.
దార్శనికత, నిబద్ధత..
తండ్రికి గోపిచంద్ అన్ని విధాలా అండగా నిలిచారు. చిన్నవయస్సులోనే వ్యా పార రంగంలోకి ప్రవేశించారు. వ్యాపారంలోకి ప్రవేశించినప్పుడు గోపిచంద్ వయ స్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. నిబద్ధత, దార్శనికతతో పనిచేస్తూ క్రమంగా కంపెనీల నిర్వహణ బాధ్యతలను భుజానికి ఆయన ఎత్తుకున్నారు. గోపిచంద్ సునీత హిందుజాను వివాహం చేసుకున్నారు.
దంపతుల కు ఇద్దరు కుమారులు సంజయ్, ధీరజ్, ఒక కుమార్తె రీటా. 1997లో ఆ కుటుంబం బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందింది. గోపిచంద్ తన కంపెనీని ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, పవర్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పదకొండు రంగాలకు విస్తరించారు. అశోక్ లేలాండ్, గల్ఫ్‌ఆయిల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వీరి ప్రముఖ కంపెనీలు.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో వీరి వ్యాపారాలు సాగుతున్నాయి. గోపిచంద్ 2012లో ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్ ఫ్లూయిడ్స్ తయారీదారు సంస్థ యుఎస్ సంస్థ హౌటన్ ఇంటర్నేషనల్‌ను కొనుగోలు చేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నారు.
పారిశ్రామిక రంగంలో గోపిచంద్ సాధించిన విజయాలు కేవలం తమ కంపెనీ ఆర్థికాభివృద్ధికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్ సంస్థ తాజాగా గోపిచంద్ హిందూజా కుటుంబాన్ని బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న కుటుంబంగా పేర్కొంది. వీరి కుటుంబ ఆస్తుల విలువ అక్షరాల 37.3 బిలియన్ పౌండ్లు.
సామాజికసేవలో ముందంజ
గోపిచంద్‌తో పాటు సోదరులు శ్రీచంద్, తమ్ముళ్లు ప్రకాష్, అశోక్ పూర్తి గా శాకాహారులు. వీరంతా మద్యపానానికి పూర్తిగా దూరం. వీరి కుటుంబం తొలి నుంచి మహాత్మాగాంధీ, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారా యణన్ ఆద ర్శాలను పాటిస్తూ వస్తున్నది. ఆ విలువలతో అనతికాలంలోనే ఇండో మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుంచి ఒక అంతర్జాతీయ కంపెనీగా మార్చారు.
సామాజిక సేవక కార్యక్రమాలు నిర్వహించేందుకు గోపిచంద్ ‘హిందుజా ఫౌండేషన్’ను స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా భారత్‌లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చేయూతనం దించారు. వేలాదికి వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజారోగ్య సంరక్షణకు చర్యలు తీసుకున్నారు.