calender_icon.png 10 May, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

14-03-2025 03:39:31 PM

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) శుక్రవారం నాడు గ్రూప్‌-3 ఫలితాలు(TSPSC Group 3 Exam Results 2025 Released) విడుదల చేసింది. గ్రూప్ -3 జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్పీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 1,388 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

ఈ పరీక్షలకు 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ ట్రీ పోస్టు 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. టీజీపీఎస్పీ ఫలితాలతో పాటే ఫైనల్ కీ.. అభ్యర్థుల లాగిన్ ఐడీలకి ఓఎంఆర్ షీట్స్ ను కూడా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో తనిఖీ చేయవచ్చు.

గ్రూప్-3లో టాప్ ర్యాంకర్ కు 339.24 మార్కులు వచ్చాయి. గ్రూప్-3లో మహిళ టాప్ ర్యాంకర్ కు 325.15 మార్కలు. గ్రూప్ -3లో మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళ అభ్యర్థి ఉన్నారు. మొదటి 50 ర్యాంకుల్లో కేవలం నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. గ్రూప్-3 అభ్యర్థులు లాగిన్ ఐటీలకు  ఓఎంఆర్ షీట్లు, 2,49,557 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్పీ వెల్లడించింది.