25-11-2025 06:25:29 PM
మహిళల ఆర్థికాభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది..
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..
పాపన్నపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, మహిళల ఆర్థికాభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పొడిచన్ పల్లి రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం రైతులు, పేదల పక్షపాతి ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళ శక్తి చీరలు, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.
ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు. మహిళలు ఒకే పనికి పరిమితం కాకుండా, అని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీదనే కల్యాణ లక్ష్మి, ఇందిర మహిళా శక్తి చీరల వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నదని తెలిపారు. వడ్డీ లేని రుణాల రాయితీ కింద రూ.30 కోట్ల 50 లక్షలు చెక్కును అందించారన్నారు.
మంగళవారం ప్రత్యేకంగా 11 వేల మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 8.89 కోట్లు వడ్డీ రాయితీ అందించామన్నారు. మహాలక్ష్మి పథకం కింద 04 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా 100 కోట్ల మహిళలు లబ్ధి పొందారన్నారు. గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యం పై రూ.28 కోట్ల 65 లక్షల లబ్ధిదారుల జీరో అకౌంట్ లో జమ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీకాంతప్ప, గౌస్ పాష, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.