calender_icon.png 25 November, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాయిపేట గ్రామంలో మహిళలకు చీరల పంపిణీ..

25-11-2025 06:35:38 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం “మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ప్రభుత్వం చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలోని మహిళల అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ ఏ ఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయం. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వయం సహాయక సంఘాల విఓలు అనిత హన్మండ్లు, సవిత దిగంబర్, బుక్ కీపర్ రాములు, గ్రామ పెద్దలు జయ వీరప్ప, రాధాక్రిష్ణ, యువజన నాయకులు రత్నాకర్, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.