25-11-2025 06:32:27 PM
శాంతిఖని జీఎం రాధాకృష్ణ..
బెల్లంపల్లి అర్బన్: మందమర్రి ఏరియాలో ఈడి(కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, బి.వెంకన్న, ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కలిసి పర్యటించారు. ముందుగా మందమర్రి జి.ఎం కార్యాలయంలో ఏరియాలోని అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు, ఏరియా స్థితిగతులపై చర్చించారు, అనంతరం కే.కే ఓ.సి వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలు పరిశీలించారు. అనంతరం కేకే–01 సైడింగ్ పనుల పురోగతి గనిలోని వివిధ పని ప్రదేశాలను పరిశీలించారు.
ఉత్పత్తి ఉత్పాదకత రవాణా వ్యవస్థ భద్రత చర్యలు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విధుల లక్ష్యం దిశగా మార్గదర్శకాలు అందించారు. చివరిగా శాంతి ఖని గనిని సందర్శించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు, గనిలోకి దిగి పని ప్రదేశాలను పరిశీలించారు. అక్కడి నుంచి రామకృష్ణాపూర్ కు వెళ్లారు. సిహెచ్ పి ని సందర్శించి అధికారులను దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం లలితేంద్రప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ ఈ& ఎం బాలాజీ భగవతి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.