25-11-2025 06:43:52 PM
సీఐ బాలాజీ వరప్రసాద్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ తో పాటు నెంబర్ ప్లేట్ లేని వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే సోమవారం రాత్రి నంబర్ ప్లేట్ లేని బైక్ ను పట్టుకొని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేశామన్నారు. 2024లో అబ్కారీ శాఖ అధికారులు నిర్వహించిన వేలంపాటలో కొనుకున్న బైక్ కు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో అతని బైక్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.