25-11-2025 06:38:54 PM
కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని అంతర్నీ పాఠశాలలో చదివిన తన మనవడు నేవీలో ఉద్యోగం సాధించడంతో అతని నానమ్మ అంజనమ్మ మంగళవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు. ఊరి పాఠశాలలో చదివిన తన మనవడు పూజేకర్ శ్రీకాంత్ అగ్నివీర్(Agniveer)లో ఎంపికై భారత సైన్యంలో(నేవీ) పని చేస్తున్నారు. అతని సహకార మేరకు మంగళవారం పాఠశాల విద్యార్థులకు 6000 పుస్తకాలను అందించారు. తన వంతు సహాయంగా సుమారు ₹6,000 విలువైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు అందజేశారు. పేద కుటుంబం నుండి వచ్చిన తన మన్మడు స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకుని బాగా చదివి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఉపాధ్యాయులు కత్తి నాగారావు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.