calender_icon.png 25 November, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించిన అధికారులు క్షమాపణ చెప్పాలి

25-11-2025 06:28:49 PM

ఆరెపల్లి రాహుల్ డిమాండ్..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీ నేతల పేర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, బిజెపి–టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరి పేర్లు ఆహ్వాన పత్రికలో ప్రదర్శించి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరు ఉద్దేశపూర్వకంగా తొలగించడంపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు ఆరెపల్లి రాహుల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పార్లమెంటు స్థాయిలో ప్రజల సమస్యలను నిరంతరం లేవనెత్తుతూ, ప్రజలు ఆశీర్వాదంతో 1,50,000 భారీ మెజార్టీతో గెలిచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దళిత నాయకుడిని కావాలనే అవమానించేందుకు ఈ చర్య చేపట్టారని పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటూ, ప్రజా సమస్యలను పార్లమెంటులో ధైర్యంగా వినిపిస్తున్నారన్న అంశమే కొందరు నేతలకు అసూయగా మారింది అని, దళితుడనే కారణంతోనా మా ఎంపీని అవమానిస్తున్నారు, వెంటనే దీనిపై జిల్లా అధికారులు బహిరంగ క్షమాపణలు చెప్పాలి లేదంటే దళిత జాతి ఆగ్రహానికి గురి కాకతప్పదని అధికారులను హెచ్చరించడం జరుగుతుందన్నారు, అవసరం అయితే డిల్లీ వెళ్లి ఎస్సీ  కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.