6 August, 2026 | 8:00 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించిన ఎంపీడీవో

06-08-2026 06:34 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను,అంగన్వాడి కేంద్రాన్ని,నర్సరీని ఎంపీడీవో గంగాధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ గంగాధర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు.

ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టి నిరంత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అంగడివని కేంద్రంలో పిల్లలకు అందుతున్న సేవలు పోషకాహారం పరిశుభ్రతను పరిశీలించి అవసరమైన సూచనలు అందజేశారు. అలాగే గ్రామ నర్సరీ సందర్శించి మొక్కల సంరక్షణ నిర్వాణపై అధికారులకు దిశనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సంతోష్ కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ ఫర్విన్ బేగం ఉన్నారు.