calender_icon.png 3 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న కార్గో నిర్వాహకుడు

02-11-2025 08:45:51 PM

చిట్యాల (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి ప్రయాణికునికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు కార్గో నిర్వాకుడు పొలిమేర దశరథ. వివరాల్లోకెళితే నల్గొండ నుండి భువనగిరికి వెళ్లే ఎలక్ట్రికల్ బస్సులో ఒక ప్రయాణికుడు నార్కట్ పళ్లి వరకు ప్రయాణం చేశాడు. నార్కెట్పల్లి రాగానే తన మొబైల్ ఫోన్ ను  బస్సులోనే మరిచి దిగి వెళ్ళిపోయాడు.

అనంతరం వెంటనే తన ఫోన్ బస్సులో మరిచిపోయానని నార్కట్ పళ్లి కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లడంతో కంట్రోలర్ వెంటనే చిట్యాల బస్ స్టేషన్ లో కార్గో సర్వీస్ నడుపుతున్న పొలిమేర దశరథ కు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణికుడు మొబైల్ ఫోన్ మరిచిపోయాడని వెంటనే ఫోన్ ను స్వాధీనం చేసుకోమని తెలియజేయడంతో కార్గో నిర్వాహకుడు దశరథ వెంటనే స్పందించి బస్ స్టేషన్ కి వచ్చిన ఎలక్ట్రికల్ బస్సు ఎక్కి బస్సు డ్రైవర్ కు విషయం చెప్పగానే బస్సులో వెతికారు.

అప్పుడు ప్రయాణికుడు ప్రయాణించిన సీట్ లోనే మొబైల్ ఉండడం గమనించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి తన మొబైల్ ను పొందాడు. తన ఫోన్ ను తనకు అందించిన కార్గో నిర్వాకుడు దశరథ నిజాయితీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.