12-07-2025 02:27:16 PM
హైదరాబాద్: కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) విప్లవాత్మక నిర్ణయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud) గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలోఅన్నారు. కీలకమైన నిర్ణయాన్ని అభినందించేందుకు కూడా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు మనసు రావటం లేదని మహేష్ కుమార్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కడుపునిండా విషయం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని ఆరోపించారు. బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్(KCR) నోరు విప్పటం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kalvakuntla Kavitha) తన విజయమని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారు.. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తాము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారని చెప్పారు.