calender_icon.png 21 November, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు

25-07-2024 01:30:48 AM

  • ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 
  • జూరాలకు 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీటి ప్రవా హం కొనసాగుతోంది. గోదావరి బేసిన్‌లోని ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద రావడంతో మేడిగడ్డ, సమ్మక్క సాగర్, దుమ్ము గూడెం, భద్రాచలం వద్ద సుమారు 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వృథాగా దిగు వనకు పోతోంది. కృష్ణాబేసిన్‌లో తుంగభద్ర నది పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో 10 గేట్లు ఒక అడుగు మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 7,772 క్యూసెక్కులు వదులుతున్నారు. రాత్రి 9 గంటలకు తుంగభద్ర నుంచి సుమారు 20వేల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. బుధవారం రాత్రి 9 గంటలకు జూరాలకు 1.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అక్కడి నుంచి శ్రీశైలం వైపునకు 1.86 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.