calender_icon.png 21 November, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ హ్యాపీ బర్త్‌డే

25-07-2024 01:55:48 AM

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, స్పీకర్ 

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఎక్స్ వేదికగా సీఎం  ఆకాంక్షించారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరో గ్యం ప్రసాదించాలన్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎంకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపా రు. స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.