calender_icon.png 7 September, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన కట్టడ బురుజును పరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ

07-09-2025 12:36:59 AM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దశాబ్దాల క్రితం నిర్మించిన బురుజు ను, తూప్రాన్ డిఎస్పి ఎన్.నరేందర్ గౌడ్, చేగుంట ఏస్ఐ చైతన్య కుమార్ కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ,వందల ఏళ్ల క్రితం సంస్థానాధీశుల చేతిలో వెలుగొందిన కట్టడాలు, ప్రస్తుతం  గ్రామాలలో,ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.బురుజు గ్రామం నడిబొడ్డున ఉండటంతో ఇక్కడ పలు సినిమాలను, షార్ట్ ఫిల్మ్, చిత్రీకరించారు కాబట్టి రాష్టంలో గ్రామ పెరు చిరుస్థాయిలో నిలుస్తుందని, అంతేకాకుండా బురుజు లోపల ఇల్లు కూడా ఉండటం విశేషం అని అన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గ మాత అమ్మవారిని దర్శించుకున్నారు.