22 August, 2026 | 2:25 AM

షట్టర్ లిఫ్టింగ్ దొంగతనం కేసును ఛేదించిన తూప్రాన్ పోలీసులు

22-08-2026 12:57 AM

తూప్రాన్ ఆగస్ట్ 21: తూప్రాన్ పట్టణంలో షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని సాంకేతిక ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తూప్రాన్ పట్టణం లోని ప్రధాన రహదారులపై ఉన్న రెండు షట్టర్ దుకాణాల్లో ఫర్టిలైజర్, చెప్పుల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులను తూప్రాన్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఛేదించారు.

ఈ కేసులో నిందితుడిగా కందుల సత్యనారాయణ, ప్రస్తుతం దిల్సుఖ్నగర్, హైదరాబాద్, పూర్వ నివాసం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ గా గుర్తించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించగా ఇతను ఇతర ప్రాంతాల్లో సైతం దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితుడిగా తూప్రాన్ పోలీసులు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణలో నిందితుడు తూప్రాన్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న రెండు షట్టర్ దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. న్యాయస్థానం అనుమతి తో నిందితుడిని శుక్రవారం నల్గొండ జైలు నుండి మెదక్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జైలుకు తరలించడం జరిగింది. నేరస్థులను గుర్తించి కేసులను ఛేదించడం లో తూప్రాన్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నామని ఎస్ ఐ. గంగరాజు పేర్కొన్నారు.