calender_icon.png 4 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా అమ్ముతున్న వారిపై పోలీసులు కన్నెర్ర

24-07-2025 08:52:43 PM

తహశీల్దార్ ముందు ఆరుగురుని బైండోవర్ చేసిన పోలీసులు..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని గుడుంబా తయారీ విక్రయంపై పోలీసులు కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ, సునార్కని సత్యం, సుధాకర్, సంతోష్, దుర్గం మహేందర్, అసరెల్లి రవిలపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్(SI Venkatesh) తెలిపారు. ఈ సందర్భంలో ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ, వీరు రోజువారీగా గుడుంబా సరఫరా చేస్తున్నారని, ఈ నిందితులను మండల తహసీల్దార్ ఎదుట హాజరుపరిచామని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే 6 నెలల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బైండోవర్ పత్రాలు తహశీల్దార్ కి సమర్పించామని తెలిపారు. నిందితులను మంచి ప్రవర్తన కోసమని తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు అన్నారు.