శ్రీవారి దర్శనానికి 20 గంటలు
25-05-2024 03:25 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ఏపీలోని తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. శుక్రవారం రద్దీ నేపథ్యంలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఎండకాలం సెలవులు, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్యా జూన్ 30వ తేదీవరకు వారాంతాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.






