25-01-2026 07:27:20 PM
బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి శివాజీ, అంబేద్కర్ చౌక్ వరకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. అనంతరం
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ రఘునాథ్ రావ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారిని ఓటింగ్ వైపు పోత్సహించేలా నేడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.