25-01-2026 07:24:13 PM
భారతదేశ ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి, గోలిలింగాల, లింగంపల్లి, మాల్తుమ్మెద, జలార్పూర్, ధర్మారెడ్డి తదితర గ్రామాల్లో 16వ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు ఆధ్వర్యంలో గ్రామస్తులు, గ్రామ ప్రజలు, యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు భారతదేశ పౌరులమైన మనము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్ గౌడ్,సునంద కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణ,బుర్రకాయల రోజా,అనిత గోపాల్ గౌడ్, సాయిలు,ఓటర్లు పాల్గొన్నారు.