25-01-2026 07:21:11 PM
జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు కారింగుల అంజన్ గౌడ్
కోదాడ: ఉత్తమ్ దంపతులపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు కారింగుల అంజన్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం సేవలందించిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో సరికావున్నారు.
అభివృద్ధి తమ శ్వాసగా, కోట్ల రూపాయల నిధులతో ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారని అటువంటి వ్యక్తులపై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇటువంటి మాటలు రాజకీయాలలోకి రావాలనుకుంటున్న యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. బహిరంగ సభలో ర్యాలీలలో మాట్లాడేటప్పుడు నియంత్రణతో మాట్లాడాలని హితవు పలికారు.తక్షణమే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.