calender_icon.png 29 September, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకరి మృతికి కారణమైన ఇద్దరి అరెస్టు

29-09-2025 01:03:06 AM

అనుమానం రావద్దని వాగులో శవాన్ని పాడేసిన వైనం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):  పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రమాదకరమైన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంది. అయితే మృతి చెందిన వ్యక్తి శవం తమ పంట పొలాల్లో ఉంటే అనుమానం వస్తోందని వాగులో పడేసిన ఘటనను పోలీసులు ఛేదించి, ఒకరి మృతికి కారణమైన ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆదివారం ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 20వ తేదీన రోల్ మామడ గ్రామానికి చెందిన మండాడే రంబు అనే వ్యక్తి కనిపించకుండా పోయి, 23వ తేదీన  ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి చనిపోయాడు. కాగా మృతుడు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా దర్యాప్తులో కొన్ని విషయాలు బైట పడ్డాయి.

చిక్రమ్ పాండు అనే వ్యక్తి అడవి పందుల నుండి తన పంటను రక్షించుకునేందుకు పంట చుట్టూ విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు. కరెంటు వైర్ తగిలితే చనిపోతారని తెలిసి కూడా కరెంట్ వైర్ ను తన పొలంలో ఏర్పాటు చేయడంతో మండాడే రంబు అనే వ్యక్తికి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. ఐతే  శవం తన పంటపొలాల్లో దొరికినట్లైతే తనపై కేసు అవుతుందని అ శవాన్ని మాయం చేయాలని అనుకుంటాడు.

దింతో తన బామ్మర్ది ఈశ్వర్ సహాయం తో  శవాన్ని కడం వాగులో పడేసారు. పోలీసుల పూర్తి విచారణ లో ఈ విషయం బయటపడింది. దింతో రంబు మృతికి కారణమైన చిక్రం పాండు @ పాండురంగ్, మృతదేహాన్ని వాగులో పడేసేందుకు సహకరించిన ఈశ్వర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరళించినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా రైతులు పంట రక్షణ కొరకై ప్రమాదకరమైన కరెంటు వైర్లు పెట్టినట్లయితే వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని సీఐ వెల్లడించారు.