14 April, 2026 | 1:21 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

వ్యాపారం పేరిట మోసం ఇద్దరి అరెస్ట్

27-03-2025 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి): వ్యాపారం, పెట్టుబడి పేరిట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. నగ రానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. అతని వ్యాపారానికి ఆర్డర్లు ఇప్పిస్తామని నమ్మించారు. ఆ విషయాన్ని నమ్మి వారికి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాడు. ఆ తర్వాత అతని ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉందని ఈ మెయిల్ పంపారు. వారిని నమ్మి బాధితుడు రూ.9.50లక్షలను ఛార్జీలుగా చెల్లించాడు.

ఆ డబ్బును తీసుకున్న సైబర్ నేరగాళ్లు అతనికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీకి చెందిన అమర్‌నాథ్‌సింగ్, రణ్‌వీర్‌సింగ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు సోషల్‌మీడియా కాల్స్, మెసేజాల ద్వారా బాధితున్ని మోసగించినట్లు గుర్తించారు. వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నమ్మించారు. వారి నుంచి 4మొబైల్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.