భూవివాదంలో ఇద్దరు అరెస్ట్
24-05-2024 02:23 AM
రాజన్న సిరిసిల్ల, మే 23, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు భూవివాదాల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి విజయకు ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన మంత్రి రఘు, టింకూ రూ.20 లక్షలకు 24 గుంటల భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు. హద్దులు పెట్టాలని కోరగా తప్పించుకు తిరగడమే కాకుండా తాము నక్సలైట్లమంటూ విజయను బెదిరించారు. విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రఘును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తర లించారు. అలాగే మరో కేసులో ఎల్లారెడ్డిపేట వాసి ఉప్పుల నారా యణ ఫిర్యాదుతో సిరిసిల్లకు చెం దిన రాగుల రాములును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.






