16 August, 2026 | 7:15 AM

సుందిళ్ల బరాజ్ సందర్శన

24-05-2024 02:22 AM

మంథని, మే 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పార్వతి (సుందిళ్ల) బ్యారేజీని గురువారం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం పరిశీలించింది. 61 గేటు వద్ద కుంగిన గార్డర్లను పరిశీలించి వివరాలు నమోదు చేసింది. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల నేపథ్యంలో బృందం ఈ ప్రాంతంలో పర్యటించిందని తెలుస్తున్నది.