calender_icon.png 22 January, 2026 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు

19-09-2024 01:12:46 AM

భద్రాచలం, సెప్టెంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలరు అపహరిస్తున్న ఇద్దరిని భద్రాచలం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక, గాంధీనగర్‌కు చెందిన అద్దంకి రాఘవన్ అలియాస్ గౌతమ్, అదే గ్రామంలోని ఒడియా క్యాంపునకు చెందిన కోసలా మిధున్, మరో నలుగురితో కలిసి ద్విచక్రవాహనాలను, సెల్ ఫోన్లను దొంగిలిస్తున్నారు. వాటిని అమ్ముకొని వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. అందులో గౌతమ్, మిధున్ బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి నుంచి ఒక ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.