8 July, 2026 | 7:56 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం

24-05-2025 12:00 AM

ఎల్బీనగర్, మే 23 : రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడారు. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెంది గా, మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాలు... మన్సురాబాద్ సౌత్ అండ్ పార్కు కు చెందిన అజ్మీరా రాజశేఖర్ ఈనెల 22న తన బైక్ తీసుకొని ఎల్బీనగర్ సిరీస్ రోడ్ నుంచి వెళ్తున్నాడు.

క్రమంలో అతడు దుర్గ బాణాసంచా షాప్ దగ్గరికి వెళ్లగా అటువైపు నుంచి గ్లామర్ ద్విచక్ర వాహనంపై గోపికృష్ణ అనే వ్యక్తి వేగంగా వచ్చి రాజశేఖర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఇరువురు కిందపడిపోయారు.ఈ ప్రమాదంలో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదం విషయాన్ని రాజశేఖర్ తమ్ముడికి  అందిం చారు. ఘటనా స్థలానికి చేరుకున్న తమ్ముడు  గాయపడిన అన్నను కామినేని హాస్పిటల్ లో చేర్పించారు.

అనంతరం ఎల్బీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్న అజ్మీర రాజశేఖర్ మృతి చెందినట్లు డాక్టర్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. రాజశేఖర్ బైకును ఢీ కొట్టిన గోపికృష్ణ కూడా కామినేని హాస్పిటల్ ఐసీయూలో  చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.