calender_icon.png 24 May, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

24-05-2025 12:00:00 AM

కుమ్రం భీం అసిఫాబాద్, మే23 (విజ యక్రాంతి): కౌటాల మండలం తాటిపల్లిలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాటిపల్లికి చెందిన విశ్వనాథ్ కూతురు రాధిక(13),మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా ఎట్టపెల్లికి చెందిన హన్సిక(12) బహిర్భూమికి వెళ్తున్న క్రమం లో కాలుజారి నీటి కుంటలో పడిపోయారు.

ఇటీవల కురిసిన వర్షాలతో కుంటలో నీరు నిల్వ ఉండడంతో చిన్నారులు నీటిలో ముని గి మృతి చెందారు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుంటలో నుంచి చిన్నారులను బయ టకు తీసి చూసేసరికి చిన్నారులు అప్పటికే మృతి ఉన్నారు. ఎండాకాలం సెలవులలో బంధువుల ఇంటికి వచ్చిన హన్సిక  కుంట లో పడి మృతి చెందడంతో గ్రామాలలో  విషాదఛాయలు నెలకొన్నాయి.