తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
24-05-2025 12:00 AM
ఖానాపూర్, మే౨౩ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని సుజ్జాపూర్ వరి ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యా న్ని కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు నిర్మల్ మంచిర్యాల రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు ఆలస్యం చేయడం తోనే వరి ధాన్యం తడిసిపోయిందని ప్రభు త్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పగా కలెక్టర్ హామీ ఇస్తే విరమిస్తామ ని రైతులు చెప్పడంతో కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.






