01-10-2025 02:23:27 AM
సిమెంట్ సంచుల మధ్యన గంజాయి సంచులు
అబ్దుల్లాపూర్మెట్ పరిధి కొత్తగూడలో పట్టుకున్న పోలీసులు
ఒకరి అరెస్ట్, పరారీలో ముగ్గురు నిందితులు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 30: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్‌కు మినీ వ్యాన్‌లో సిమెంట్ సంచుల మధ్యన తరలిస్తున్న రూ.6.25 కోట్ల విలువైన గంజాయిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధి కొత్తగూడలో మంగళవారం పోలీసులు పట్టుకు న్నారు. ఒకరిని అరెస్టు చేయగా.. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయం రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్ జిల్లా అనియా గ్రామానికి చెందిన విక్రమ్ విష్ణోయి (22) డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గంజాయి స్మగ్లర్లు దేవీలాల్, ఆయుబ్ ఖాన్, రామ్‌లాల్‌లతో పరిచయం ఏర్పడింది. దీంతో విక్రమ్‌కు ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి రాజస్థాన్ జోద్‌పూర్‌లో వారికి అప్పగిస్తే ప్రతి సరుకుకు రూ.5 లక్షలు ఇస్తామని ఆశ చూపారు.
ఒప్పుకున్న విక్రమ్ ఈ నెల 29న ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలోని గుర్తుతెలియని ప్రాంతాల నుంచి సుమారు 1,210 కిలోల నిషేధిత గంజాయిని సేకరించాడు. అక్కడి నుంచి సిమెంట్ సంచుల మధ్యన గంజాయి సంచులను దాచి టార్ఫాలిన్‌తో కప్పి తరలిస్తున్నాడు. హైదరాబాద్ మీదుగా రాజస్థాన్‌కు బయలుదే రాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం మహేశ్వరం ఎస్‌ఓటి బృందం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌ల సహాయంతో కొత్తగూడ ఎక్స్‌రోడ్‌లో మినీ వ్యాన్‌ను ఆపి, తనిఖీలు నిర్వహించగా రూ. 6.25 కోట్ల విలువైన 1,210 కిలోల గంజా యి పట్టుబడింది.
దీంతో విక్రమ్ విష్ణోయ్‌ని అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మిగ తా సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే మొదటి సారి అని ఇంత చాకచక్యంగా వ్యవహరించి గం జాయిని పట్టుకున్న ఎస్‌ఓటి మహేశ్వరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులను సీపీ సుధీర్‌బాబు అభినందించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ ఎండి షకీర్ హుస్సేన్, ఏసీబీ సత్త య్య, ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ టి రవికుమార్ ఉన్నారు.