25 May, 2026 | 1:05 AM

కోరటికల్ గ్రామంలో రెండు గడ్డివాములు దగ్ధం

25-05-2026 12:00 AM

మునుగోడు,మే 24 : ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ల నుండి రాలి పడిన నిప్పురవ్వలు అంటుకొని రెండు గడ్డివాములు దగ్ధమైన సంఘటన మండలంలోని కొరటికల్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెం దిన కుర్పాటి మల్లేష్, దండు శేఖర్ కు చెందిన గడ్డివాముల పక్కన ఉన్న విద్యుత్ తీగల నుండి నిప్పు రవ్వలు రాలి పడి అంటుకొని అవి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు.

ఈ ఘటనలో ఒక్కో రైతుకు సుమారు రూ.25 వేల చొప్పున నష్టం వాటిల్లినట్లు గ్రామస్థు లు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న స్థానికులు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్,ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో పశువుల మేత పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.