జూన్ 17న ‘డాక్ అదాలత్’...
సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ వినతి
కరీంనగర్ క్రైం, మే 24(విజయక్రాంతి): హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో పోస్టల్ సేవలకు సం బంధించిన ప్రజల ఫిర్యాదులు, వినతులను పరిష్కరించేందుకు 54వ డాక్ అదాలత్ ను జూన్ 17న ఉదయం 11:00 గంటలకు ఆన్లైన్ (వర్చువల్ మోడ్) ద్వారా నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ కె. సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ ఫిర్యాదులు లేదా వినతులను 54th Dak Adalat అని కవ్ప స్పష్టంగా పేర్కొనాలని,
జూన్ 5వ తేదీలోపు కె. శ్రీకాంత్ సహాయ డైరెక్టర్ (స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్ 500001 అనే చిరునామాకు పంపించాలని పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహారాలు, సర్వీస్ సంబంధిత అంశాలు మరియు గౌరవ న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన ఫిర్యాదులు డాక్ అదాలత్లో పరిగణించబడవని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ ఆ ప్రకటనలో కోరారు.






