‘ఎంఎస్‌ఎన్’ కంపెనీలో ఇద్దరికి గాయాలు
- రియాక్టర్ లీక్ కావడంతో ప్రమాదం
- బాధితులకు ఆస్పత్రికి తరలించిన యాజమాన్యం
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధిలో ఘటన
కామారెడ్డి, జూన్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధి లోని ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీలో రియా క్టర్ లీకై ఇద్దరు కార్మికులకు గాయాలయ్యా యి. కాచాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి కిషన్, మరో కార్మికుడు పనిలో ఉండగా రియాక్టర్ గ్యాస్ లీకై ప్రమాదం సంభవిం చింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడడంతో పలువురు బయటకు పరు గులు తీశారు. గాయపడిన ఇద్దరు కార్మికు లను ఫ్యాక్టరీ యజమాన్యం ఆస్పత్రికి తరలించారు. గకొంతకాలంగా ఫ్యాక్టరీలో రియాక్టర్లు లీక్ అవుతుతున్న విషయాన్ని అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పలువురు కార్మికులు పేర్కొన్నారు.
విధులు నిర్వహిస్తున్న తమకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తు ఇస్తుం దోనని కార్మికులు ఆందోళన చెందుతు న్నారు. ఫార్మాసూటికల్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల నీరు కాలుష్యం అవుతుందని గతంలో పలు గ్రామాల ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విదితమే.






