calender_icon.png 26 July, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు రిమాండ్

26-07-2025 12:20:27 AM

6.65 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

ఘట్ కేసర్: నిషేధిత గంజాయిని కలిగి ఉండి అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఎక్సైజ్ సీఐ జూపల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ అధికారి కె. నవీన్ కుమార్ సూచనల మేరకు  ఎక్సైజ్ సూపరిండెంట్ బి. ముకుంద్ రెడ్డి పర్యవేక్షణలో  దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్ వద్ద ఎండీ నవాజ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా ఎండు గంజాయి కలిగి ఉండి విక్రయిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందిందని దీంతో ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఘట్‌కేసర్, సిబ్బంది కలిసి సాయంత్రం 5:30 గంటలకు దాడి చేయడం జరిగిందన్నారు.

ఆవ్యక్తి తన  పేరు  మొహమ్మద్ నవాజ్ ఖాన్ (34), అని తెలియజేసినట్లు చెప్పారు.  ఇంటిని వెతికినప్పుడు వంటగది గదిలో ఒక నల్ల రంగు కాటన్ కవర్ లో కొన్ని ఎండు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. ఆకులు, పువ్వులు మరియు విత్తనాల పదార్థం నుండి ఘాటైన వాసన వస్తోందని ధృవీకరించగా, గత అనుభవం ఉన్న అధికారులు ఆ పదార్థాన్ని ఎండిన గంజాయిగా గుర్తించారు. తదుపరి విచారణలో ఎండీ నవాజ్ ఖాన్ తన స్నేహితుడు  మహబూబ్ ఆలం నుండి ఒక కిలో ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతను చిన్న ప్యాకెట్లను, ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ. 500కి విక్రయిస్తున్నాడు. తదుపరి విచారణలో  షేక్ మహబూబ్ ఆలం తాను  కాంపెల్లి తిరుపతి (27) అనే వ్యక్త వద్ద ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. 

షేక్ మహబూబ్ అలం నాలుగు నెలల క్రితం మర్డర్  కేసులో చెర్లపల్లి జైలుకి వెళ్లినపుడు కాంపెల్లి తిరుపతితో పరిచయం ఏర్పడిందని, ఎండు గంజాయి వ్యాపారం ఎలా చేయాలో కాంపెల్లి తిరుపతి చెప్పాడు అని తెలిపాడు.  మొహమ్మద్ నవాజ్ ఖాన్ కు ఒక కిలో ఎండు గంజాయిని అమ్మాడు. అతను తెలియని గంజాయి వినియోగదారులకు సుమారు 3కిలోల ఎండు గంజాయిని అమ్మడు. అతను ఒక కిలో ఎండు గంజాయిని రూ. 15,000 వేలకు అమ్ముతున్నాడు. పైన వున్న ముగ్గురు వ్యక్తులు ఎండు గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన లాభం పొందుతున్నారు. యాక్ట్-1985 కింద కేసు నమోదు చేశారు. వీడియో రికార్డ్ చేసిన పెన్ డ్రైవ్‌తో పాటు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరు పరిచారు. ఈదాడిలో నాతోపాటు ఎస్ఐ లు ఎం. సంగీత, వి. నందిని  మరియు సిబ్బంది పాల్గొన్నారు.