26-07-2025 12:21:48 AM
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25,(విజయ క్రాంతి) : అనారోగ్య కారణంతో మనస్థాపానికి గురై కేటీపీఎస్ ఉద్యోగి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శుక్రవారం పాల్వంచ పట్టణ పరిధిలోని కేటీపీఎస్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కేటీపీఎస్ కర్మాగారంలో ఫోర్ మెన్ గ్రేడ్-1 గా పనిచేస్తున్న ముల్లపూడి రామ్ నీల్ ప్రసాద్ (48) కొద్దికాలంగా మద్యానికి బానిస అ య్యాడు.
కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించగా, లంగ్స్ ప్రాబ్లం ఉందని, మందులు వాడాలని వై ద్యులు సూచించారు. అప్పటి నుండి మానసికంగా కృంగిపోయాడు. శుక్రవారం ఉద యం (బాంబే కాలనీ క్వార్టర్ నెంబర్ ఎఫ్ - 515) తన రూమ్‌లో పడుకుంటానని కు టుంబ సభ్యులకు చెప్పాడు. మధ్యాహ్నం డ్యూటీ ఉండటంతో.. కుటుంబ సభ్యులు తలుపు కొట్టిన తీయలేదు. తలుపు డోర్ గట్టిగా తీసేసరికి, సీలింగ్ ఫ్యాన్ కు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించా డు. ఉరి నుండి తప్పించి, వెంటనే కేటీపీఎస్ వైద్యశాలకు తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మృతునికి భార్య స్నేహలత, ఇద్దరి సుస్మిత, సాయి తన్మయి ఆడపిల్లలున్నారు. కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.