04-01-2026 01:07:10 AM
తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత రెండు తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (90 టీఎంసీలతో త్రాగునీరు, సాగునీరు)కు కేంద్రం అనుమతులు ఇవ్వాలని తీర్మానించింది. ఇక అంతర్రాష్ట జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం లింక్ ప్రాజెక్టు లేదా పోలవరం నల్లమలసాగర్ లింక్ లేదా ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాం టి అనుమతులూ ఇవ్వొద్దని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.