calender_icon.png 16 August, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట బంగారం దుకాణం దొంగతనం కేసులో మరో ఇద్దరు దొంగల అరెస్టు

16-08-2025 07:39:09 PM

554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.92,50 వేల నగదు  స్వాదినం

జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు  వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట(విజయక్రాంతి):  సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జ్యుయలరీ షాపులో జులై 21వ తారీకున జరిగిన బంగారం చోరీకేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు.  షాపులో 2.5 కేజీల బంగారం, డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై  2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. దీనిపై దర్యాప్తు  చేస్తుండగా జూలై నెల 27వ  ఏ7 యశోద అనే మహిళను అరెస్టు చేసి 14 తులాల బంగారం స్వాధీనం చేసుకున్న ఘటన విదితమే.

ఆమె ఒప్పుకోలు ప్రకారం మొత్తం 7 గురు కోసం గాలిస్తుండగా నేపాల్ కు చెందిన ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్,  ఎ6 నిందితుడైన అమర్ భట్ లు, వెస్ట్ బెంగాల్ కు చెందిన దొంగలు ఉన్నట్లు గుర్తించాలన్నారు. దీనీలో భాగంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దక్షిన్ దినాజ్ పుర్ జిల్లా, స్కూల్ పరహ పోస్ట్, బికహర్ మండలం, తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎ4 మాలిక్ మొల్ల అనే దొంగను ఈ నెల 11న అతని స్వగ్రామం భైహోర్ నందు అరెస్టు చేశామన్నారు. అలాగే నేపాల్ కు చెందిన A6 నిందితుడు అమర్ భట్ ను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకుని రూ.5 వెలు నగదు సీజ్ చేశామన్నారు.

 ఎ4 మాలిక్ మొల్ల నిందితున్ని నిభందనలు ప్రకారం  అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు రూ.60 లక్షల విలువగల 554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.87,500/- నగదు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపాడు. ఇతనిని విచారించగా నేపాల్ కు చెందిన ఎ1 ప్రకాశ్ అనిల్ కుమార్, ఎ2 కడక్ సింగ్, ఆహ్లూవాలియ, ఎ3 పురన్ ప్రసాద్ జోషి, వెస్ట్ బెంగాల్, మల్దా జిల్లా కు చెందిన ఎ5 జషిముద్దీన్ లతో కలిసి సాయి సంతోషి జువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడన్నారు. ఎ4 మాలిక్ మోల్లా ఒప్పుకోలు ప్రకారం వివరాలు నమోదు చేసి కోర్టులో రిమాండ్ కు పంపామన్నారు. త్వరలో మిగిలిన నిందితులను పట్టుకుని సొత్తు  రికవరీ చేస్తామన్నారు. అలాగే ఈ కేసులో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్ ఇచ్చి అభినందించారు.