16-08-2025 08:43:50 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కృష్ణాష్టమి(Krishna Janmashtami) సందర్భంగా శనివారం పాత పాల్వంచలో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండగ నిర్వహించారు. పాత పాల్వంచ గడియకట్టలో కోసూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఈ పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్బంగా పాత పాల్వంచ గడియకట్టలోని వ్యాపారస్తులు కోసూరి సాంబశివరావు గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణుడికి అభిషేకాలు, 108 వంటలతో మహానైవేద్యం, ఉట్టి కొట్టడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పూజ నిర్వాహకులు కోసూరి కిరణ్, కోసూరి మోహన కృష్ణ, గ్రామస్తులు వంగా రమేష్, మసనం శరత్, మల్లేష్, ఉండేటి శాంతి వర్ధన్* తదితరులు పాల్గొన్నారు.