calender_icon.png 16 August, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల బీభత్సంతో ధ్వంసమైన వరి చేను

16-08-2025 08:52:49 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని చెరువు ప్రక్కన గల కౌలు రైతు కొండూరు భాస్కర్ కు చెందిన వరి చేను కోతుల బీభత్సంతో ధ్వంసం అయింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ వలిగొండ చెరువు ప్రక్కన గల వ్యవసాయ భూమిని తాను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నానని శనివారం మధ్యాహ్నం వందలాది కోతులు ఒక్కసారిగా వరి చేనులోకి రావడంతో వదులు ఇష్టానుసారంగా వరి చేనును పెకిలించి, త్రొక్కి ధ్వంసం  చేశాయని దీంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపుగా పెరిగిన వరి చేను కోతుల బీభత్సంతో పాడు కావడంతో కంటతడి పెడుతూ ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరారు.