16-08-2025 08:59:06 PM
సంగెం-బొల్లపల్లి గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామ వద్ద గల భీమలింగం వద్ద మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మూసీ పరివాహ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటు ఎత్తింది. దీంతో సంగెం, బొల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరద భీమలింగ వద్ద పోటెత్తి కాజువే మీదగా ప్రవహిస్తుండడంతో స్థానిక రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై కాజువే ఇరువైపులా భారీకేడ్లను ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తం చేశారు.