calender_icon.png 3 July, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి

14-06-2025 08:47:43 PM

వాజేడు (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని మండల పరిధిలో గల వాజేడు మండల కేంద్రంలో గల స్థానిక ఎస్సై జక్కుల సతీష్(SI Jakkula Satish), పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ లు మండల ప్రజలకు శనివారం ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ డ్రైవింగ్ చేయరాదని, వాహనాలకు ఇన్సూరెన్స్, వాహనాలు నడిపే వారికి లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. జూన్ 15 నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎలిమెంట్ లేకుండా నడిపే వాహనదారుల వాహనాలను సీజ్ చేయబడతాయని హెచ్చరించారు. కావున వాహనదారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.