calender_icon.png 22 July, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల్లో యూకో బ్యాంక్

22-07-2025 12:17:02 AM

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.607 కోట్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): యూకో బ్యాంక్ ఈ ఏడాది జూన్ 30 నాటికి ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.5,23,736 కోట్లుగా ఉన్నదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇది 13.51 శాతం గతేడాదికంటే (వైఓవై)పెరుగుదలను చూపిస్తుంది. దీనిలో స్థూల అడ్వాన్సులు 16.48శాతం (వైఓవై)పెరిగి రూ.2,25,101 కోట్లకు చేరుకున్నాయి. మొ త్తం డిపాజిట్లు 11.37శాతం (వైఓవై)పెరిగి రూ.2,98,635 కోట్లకు చేరుకున్నాయి.

ఈ ఏడాది ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.607 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.551 కోట్లుగా ఉండగా.. ఇది 10.16శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం రూ.1,562 కోట్లు గా ఉంది. ఇది 1,321 కోట్లుగా ఉంది. ఇది 18.24శాతం వార్షిక వృద్ధిని చూపుతోంది. ‘ రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ (RAM) రంగాలలో అడ్వాన్సు లు,- బ్యాంక్ యొక్క ఆర్‌ఏఎం విభాగం 23.47శాతం పెరిగి రూ.1,25,927 కోట్లకు చేరుకుంది.

జూన్ ఆఖరు నాటికి ఎన్‌పీఏ స్థూల ఎన్‌పీఏ తగ్గింపు 69 బీపీఎస్ (వైఓవై) తగ్గుదల ద్వారా 2.63శాతానికి చేరుకుంది. మూలధన సమృద్ధి నిష్పత్తి 18.39శాతంగా ఉన్నది. క్రెడిట్ టు డిపాజిట్ నిష్పత్తి 75.38 శాతంగా ఉంది. మొత్తం వ్యాపారం 13.51 శాతం వృద్ధి చెంది ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.4,61,408 కోట్ల నుంచి రూ.5,23,736 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 11.37శాతం పెరిగాయి.