22-07-2025 12:25:05 AM
న్యూఢిల్లీ, జూలై 21: భారత సైనిక శక్తి ఏంటనేది ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రాం గణం నుంచి ప్రసంగించారు. దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మోదీ మాట్లాడారు.
దేశం సైనిక రంగంలో గొప్ప పురోగతి సాధిస్తోందని ఆయన తెలిపారు. సైనిక రంగంలో పరిశోధన, తయారీ, మేక్ ఇన్ ఇండియా ఆయుధాల ఉత్పత్తి బలపడుతోందన్నారు. ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో కే వలం 22 నిమిషాల్లోనే శత్రువుల ఇళ్లలోకి వెళ్లి వారి స్థావరాలను నాశనం చేసిందని పే ర్కొన్నారు. ఈ విజయం దేశానికి గర్వకారణమన్నారు.
దేశ భద్రతా దళాలు వి జయంవైపు పయనిస్తున్నాయని, వ ందలా ది జిల్లాలు నక్సలిజం ప్రభావం ను ంచి వి ముక్తి పొందాయని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ కొ త్త ఉ త్సాహ ంతో ముందుకు సాగుతోందని, అ ంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం ఎ గిరిన సందర్భాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఏడాది వర్షాకాలం వ్యవసాయానికి అనుకూలంగా ఉందని, నీటి నిల్వలు గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయని, ఈ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.